ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భద్రత కుదింపు కక్ష సాధింపు చర్యే: తెదేపా

ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా ఆయన కుటుంబ సభ్యులకు భద్రత తగ్గించడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. నారా లోకేష్‌కు భద్రతను జడ్ కేటగిరీ నుంచి వై ప్లస్‌కు కుదించడం, భువనేశ్వరి, బ్రాహ్మణికి భద్రత పూర్తిగా తొలగించడం కక్ష సాధింపేనని నేతలు మండిపడ్డారు.

By

Published : Jun 25, 2019, 3:22 PM IST

Updated : Jun 25, 2019, 3:41 PM IST

tdp meeting

అమరావతిలోని చంద్రబాబు నివాసంలో తెదేపా నేతలు సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన భార్య విజయమ్మ, కుమార్తె షర్మిలకు భద్రత తగ్గించాలని భద్రత సమీక్ష కమిటీ అభిప్రాయపడినప్పటికీ, అప్పటి సీఎం చంద్రబాబు అందుకు తిరస్కరించి.. వారి భద్రత ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారనే విషయాన్ని నేతలు ప్రస్తావించారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత తగ్గించారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదిక కూలగొట్టడం సరైన చర్యకాదని నేతలు అభిప్రాయపడ్డారు. అక్రమ నిర్మాణాలుగా జగన్ పేర్కొంటున్న కరకట్ట లోపలి భవనాల్లో అధిక భాగం ఉడా ఛైర్మన్‌గా మల్లాది విష్ణు, సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే నిర్మించిన విషయం సీఎంకు గుర్తులేదా అని ప్రశ్నించారు. విత్తనాల కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా చినగంజాం మండలం రుద్రమాంబపురంలో తెదేపా శ్రేణులపై వైకాపా నేతల దాడిని నేతలు ఖండించారు. తెదేపా ప్రతినిధి బృందం గ్రామంలో పర్యటించి ఆత్మహత్య చేసుకున్న పద్మ కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించారు.

Last Updated : Jun 25, 2019, 3:41 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details