ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా 'చలో కంతేరు'...నేతలు గృహ నిర్బంధం.. పోలీసుల తీరుపై ఆగ్రహం

TDP HOUSE ARREST: వెంకాయమ్మపై దాడిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ చలో కంతేరుకు పిలుపునివ్వగా.. నేతలను నిర్బంధిస్తూ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులను గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై మండిపడ్డ తెలుగుదేశం నేతలు.. తేల్చిచెప్పారు.

TDP HOUSE ARREST
TDP HOUSE ARREST

By

Published : Jun 13, 2022, 10:04 AM IST

Updated : Jun 13, 2022, 2:05 PM IST

తెదేపా 'చలో కంతేరు'... పోలీసుల మోహరింపు.. నేతలు గృహనిర్బంధం

TDP HOUSE ARREST:గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరురాలైన వెంకాయమ్మపై వైకాపా కార్యకర్తల దాడిని నిరసిస్తూ.. ఆ పార్టీ చలో కంతేరుకు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా సిబ్బందిని మోహరించారు. తాడికొండ, కంతేరులో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు తెదేపా కార్యాలయం నుంచి చలో కంతేరు కార్యక్రమం చేపట్టగా.. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబును గృహనిర్బంధం చేశారు. బయటకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసులు తీరును తప్పుబట్టిన నక్కా ఆనంద్‌బాబు.. ఎలాగైనా కంతేరు వెళ్తామన్నారు.

తాడేపల్లిలో తెదేపా నేత తెనాలి శ్రావణ్ కుమార్ ను పోలీసులు గృహనిర్బంధం చేశారు అనుమతి లేకుండా బయటికి వెళ్లరాదంటూ సిఐ శ్రావణ్ కు తేల్చి చెప్పారు. పార్టీ కార్యాలయానికి వెళ్తుంటే అడ్డుకోవడానికి మీరు ఎవరని.. తెనాలి శ్రావణ్​కుమార్ పోలీసులను ప్రశ్నించారు. కార్యాలయానికి పోవడం తన హక్కు అన్నారు. కంతేరు వెళ్లకుండా కృష్ణా-గుంటూరు జిల్లా తెలుగుదేశం నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహానిర్భంధం చేస్తున్నారు. విజయవాడలో దేవినేని ఉమా, నందిగామ లో తంగిరాల సౌమ్య లను గృహ నిర్బంధం చేసారు. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం నేతలు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు.

కంతేరులోనూ పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. గ్రామానికి వచ్చే అన్ని మార్గాలను ప్రత్యేక బలగాలను మోహరించారు. గ్రామాలకు వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అనుమతిస్తున్నారు. గ్రామంలోనూ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు నాలుగు వందల మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. తుళ్లూరు డీఎస్పీ పోతురాజు ఆధ్వర్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వెంకాయమ్మ ఇంటి చుట్టూ 30 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ద్విచక్రవాహనాలపై తిరుగుతూ భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 13, 2022, 2:05 PM IST

ABOUT THE AUTHOR

...view details