ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Yanamala comments on Jagan: రాష్ట్రంలో సైతం జగన్​పై.. రష్యా తరహా తిరుగుబాటు వస్తోంది: యనమల - వైసీపీ వర్సెస్ టీడీపీ

Yanamala ramakrishnudu comments: సీఎం జగన్ పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, జగన్​ ను ఇంటికి పంపించాలనే కసి అందరిలోనూ ఉందని యనమల రామకృష్ణుడు వెల్లడించారు. రష్యాలో జరిగిన తిరుగుబాటే రాష్ట్రంలో సైతం వస్తుందని ఆయన పేర్కొన్నాడు. పుతిన్ పెట్టుకున్న గ్రూపే పుతిన్ పై తిరగబడినట్లే..అలాగే జగన్ తయారుచేసిన మూకలతో జగన్ పై తిరుగుబాటు వస్తుందని యనమల హెచ్చరించారు.

Yanamala
Yanamala

By

Published : Jun 25, 2023, 4:01 PM IST

Yanamala Ramakrishnudu accuses CM Jagan: రష్యాలో జరిగిన తిరుగుబాటే రాష్ట్రంలోనూ తప్పదని శాసనమండలి ప్రధానప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.పుతిన్ పెట్టుకున్న గ్రూపే పుతిన్ పై తిరగబడినట్లే..అలాగే జగన్ తయారుచేసిన మూకలతో జగన్ పై తిరుగుబాటు వస్తుందని యనమల హెచ్చరించారు. విశాఖలో వైసీపీ ఎంపి కుటుంబం కిడ్నాపే నిదర్శనమన్నారు. జగన్ కు, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య అవినీతి రేసు జరుగుతోందని మండిపడ్డారు. పోటీబడి జనం సొమ్ము మింగేస్తున్నారని ఆరోపించారు. ప్రతి మంత్రిత్వశాఖలోనూ అవినీతి కుంభకోణాలేనని దుయ్యబట్టారు.

వైసీపీలో సైలెంట్ రివల్యూషన్:సీఎం జగన్ పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, జగన్​ ను ఇంటికి పంపించాలనే కసి అందరిలోనూ ఉందని యనమల తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ స్కీములు 83రద్దుచేశారని మండిపడ్డారు. బీసీల స్కీములు 27, ఎస్సీ 29, ఎస్టీ 17, మైనార్టీ 10 రద్దుచేశారని ఆక్షేపించారు. తెలుగుదేశం పై అక్కసుతోనే పేదల స్కీముల రద్దు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలంతా జగన్ బాధితవర్గాలేనని యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. వైసీపీ వాళ్లు చేసిన ఘోరాలు-నేరాలే శాపాలై వెంటబడి తరుముతున్నాయన్నారు. వీళ్లందరిలో ‘‘సైలెంట్ రివల్యూషన్’’ ఉందన్న యనమల, అందరిలో జగన్ పై తీవ్ర అసంతృప్తి ఉందని తేల్చిచెప్పారు. కేసుల భయంతో బైటపడటం లేదు, గుంభనంగా వ్యవహరిస్తున్నారన్నారు. వైసీపీలో ఉన్న నేతలంతా సమయం కోసం ఎదురు చూస్తున్నారని, ఎప్పుడెప్పుడు ఎన్నికలొస్తాయా అని కాచుక్కూర్చున్నారని విమర్శించారు.

Ayyanna Patrudu Interview: వైసీపీ పాలనలోని అన్యాయాన్ని వివరించటానికే 'భవిష్యత్​కు గ్యారెంటీ యాత్ర': అయ్యన్న

జగన్ దోచేయడంవల్లే ఖజానా ఖాళీ: దోపిడీకి కేరాఫ్ అడ్రస్ గా జగన్మోహన రెడ్డి నిలుస్తున్నారని యనమల మండిపడ్డారు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన పాపం జగన్ దేనని యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఇంత విధ్వంసకాండ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇలా చేయలేదని వాపోయారు. భూములు, గనులు, ప్రాజెక్టులు, చివరికి స్కీముల్లోనూ దోపిడీ అని మండిపడ్డారు. ప్రజల ఆస్తిని వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్ దోచేయడంవల్లే ఖజానా ఖాళీ అయిందన్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిన ఘనత జగన్ దేనని యనమల దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ ను అప్పుల్లో ముంచేశాడని, గ్రామాల్లో, వార్డుల్లో రచ్చబండలపై దీనిపైనే చర్చలు జరుగుతున్నాయన్నారు. జగన్ కోట పునాదులు బీటలు వారి వైసీపీ కోట కూలడం తథ్యమని యనమల రామకృష్ణుడు హెచ్చరించారు.

Ambati Vs Kanna: కన్నా వారి ఇంటిముందు.. ఎన్ని పార్టీల ఫ్లెక్సీలు మారాయో..!: అంబటి

జగన్ తయారు చేసిన మూకలే జగన్ పై తిరుగుబాటు చేస్తున్నారనేందుకు విశాఖలో వైసీపీ ఎంపీ కుటుంబం కిడ్నాపే నిదర్శనం. జగన్, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న అవినీతి రేసులో పోటీబడి జనం సొమ్ము మింగేస్తున్నారడు. ప్రతి మంత్రిత్వ శాఖలో అవినీతి కుంభకోణాలే ఉన్నాయి. వైసీపీ నేతల్లో ‘‘సైలెంట్ రివల్యూషన్’ ఉంది.. సమయం కోసం ఎదురు చూస్తున్నారు. జగన్మోహన రెడ్డి..భూములు, గనులు, ప్రాజెక్టులు, చివరికి స్కీముల్లోనూ దోపిడీ చేస్తున్నారు. జగన్ కోట పునాదులు బీటలు వారి... వైసీపీ కోట కూలడం తథ్యం.యనమల రామకృష్ణుడు, టీడీపీ నేత

ABOUT THE AUTHOR

...view details