రాజధాని రైతులను కించపరిచేలా వైకాపా నేతలు అంబటి రాంబాబు, డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడం సరికాదని తెదేపా నేత పిల్లి మాణిక్యాలరావు అన్నారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణించడం దారుణమన్నారు. గుంటూరు తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన... గతంలో అమరావతికి మద్దతుగా మాట్లాడిన డొక్కా... ఇవాళ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీలపై దాడులు జరుగుతుంటే డొక్కా స్పందించకపోవటం సిగ్గుచేటు అన్నారు.
రైతులను పెయిడ్ ఆర్టిస్టులనడం దారుణం: పిల్లి మాణిక్యాలరావు
వైకాపా నేత డొక్కా మాణిక్యవరప్రసాద్పై తెదేపా నేత పిల్లి మాణిక్యాలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణించటం దారుణమన్నారు.
tdp leader pilli manikyala rao