ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ సంస్థలను సరిగా నిర్వహించకపోవడం వల్లే ప్రజలపై భారం: పట్టాభి

Pattabhiram fires on YCP: ప్రభుత్వం విద్యుత్ సంస్థలను సరిగా నిర్వహించలేకపోవడం వల్లనే ప్రజలపై ట్రూ అప్ భారం పడుతోందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ధ్వజమెత్తారు. ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లలో బొగ్గు నిల్వలు సరిపడా మెయింటైన్ చేయలేకపోవడం వల్లే బహిరంగ మార్కెట్​లో అధిక ధరలకు విద్యుత్ కొనాల్సి వస్తుందని దుయ్యబట్టారు.

తెదేపా
TDP

By

Published : Oct 31, 2022, 8:43 PM IST

Pattabhiram fires on YCP: వైకాపా ప్రభుత్వం విద్యుత్ సంస్థలను సరిగా నిర్వహించలేకపోవడం వల్లనే ప్రజలపై ట్రూ అప్ భారం పడుతోందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ధ్వజమెత్తారు. తెదేపా హయాంలో వేయని రూ. 3,013 కోట్ల ట్రూ అప్ భారాన్ని ఇప్పుడు ప్రజలపై వేసి.. తెదేపా ఖాతాలో ఉంచిన రూ. 4,100 కోట్లు సొమ్ము మాత్రం ప్రజలకు చేరనీయకుండా చేసిన దుర్మార్గుడు జగన్ అని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లలో బొగ్గు నిల్వలు సరిపడా మెయింటైన్ చేయలేకపోవడం వల్లే మార్కెట్​లో అధిక ధరలకు విద్యుత్ కొనాల్సిన పరిస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. ఏడాదికి ఐదు మిలియన్ టన్నుల సామర్ధ్యం ఉన్న మధ్యప్రదేశ్ లోని ఏపీకి చెందిన సులియారీ బొగ్గు గనిని ఏపీ జెన్-కో కు ఇవ్వకుండా జగన్ అదానీకి కట్టబెట్టారని ఆరోపించారు. బొగ్గు కొరతతో జెన్-కో సామర్ధ్యానికి తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోయిందని వెల్లడించారు. బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనుగోలు ధర సరాసరిన 4.32 రూపాయలుగా నిర్ణయిస్తే ముఖ్యమంత్రి జగన్ మాత్రం బహిరంగ మార్కెట్​లో దాదాపు రూ. 15 పెట్టి కొన్నారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details