అయిదు కోట్ల ఆంధ్రుల రాజధాని కల సాకారం చేసిన వారి రక్తం కళ్లజూస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం పెట్టే భూములు ఇచ్చిన అమరావతి రైతులకు అన్యాయం చేయటంతో పాటు వారి త్యాగాల పునాదిని సమాధి చేసే కుట్రలు పన్నారని ఆక్షేపించారు. మహిళలపై దుశ్శాసనపర్వం సాగుతోందని ధ్వజమెత్తారు.
'ప్రజా రాజధానిని మహిళలు శాశ్వతం చేస్తారు'
జైల్‌భరో కార్యక్రమంలో అమరావతి మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. మహిళలపై దుశ్శాసనపర్వం సాగుతోందని దుయ్యబట్టారు. ప్రజా రాజధాని కల మహిళలు శాశ్వతం చేస్తారని లోకేశ్ ఆకాంక్షించారు.
నారా లోకేశ్
దుష్టపాలనకు చరమగీతం పాడే మహోద్యమం జరుగుతోందని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాఠీలు, తుపాకులు, నిర్బంధాలను ఎదిరించి మరీ వీరవనితలు జగన్ పతనాన్ని శాసిస్తారని హెచ్చరించారు. ప్రజా రాజధానిని వారు శాశ్వతం చేస్తారని ఆకాంక్షించారు. మహిళలపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్‌కు జత చేశారు.
ఇదీ చదవండి: ముంబై ఐఐటీ విద్యార్థులతో.. చంద్రబాబు 'విజన్'!