TDP Leader Dhulipala Narendra Kumar Pressmeet:గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో స్థానిక శాసనసభ్యుడు కిలారి వెంకట రోశయ్య, అతని అనుచరులే మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆరోపించారు. పొన్నూరు పట్టణంలో మూడవ వార్డులో ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లా నుంచే కాకుండా కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల నుంచి వైసీపీ నాయకులు ఇక్కడికి వచ్చి ప్రభుత్వంలోని పెద్దలతో చేతులు కలిపి మట్టి తవ్వి అక్రమాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. అంతర్గత రోడ్ల నిర్మాణానికి సిమెంటు ఇసుక వాడాల్సి ఉండగా వాటి స్థానంలో అధిక శాతం డస్ట్ ను ఉపయోగించి రోడ్లు వేస్తున్నారని, పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అంతర్గత రోడ్ల నిర్మాణానికి డస్ట్ వాడుతున్నారు: ధూళిపాళ్ల నరేంద్రకుమార్ - అక్రమాలకు అడ్డా వైసీపీ ప్రభుత్వం
TDP Leader Dhulipala Narendra Kumar Pressmeet: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో స్థానిక శాసనసభ్యుడు కిలారి వెంకట రోశయ్య అతని అనుచరులే మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. పొన్నూరు పట్టణంలో మూడవ వార్డులో ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
Etv Bharat