చంద్రబాబు భద్రతపై ప్రభుత్వం కోర్టులను తప్పుదారి పట్టిస్తోందని తెదేపా నేత చినరాజప్ప ఆరోపించారు. చంద్రబాబుకు భద్రతగా ఉండే 74 మంది ఎక్కడ ఉన్నారో హోంమంత్రి చూపాలని కోరారు. హోంమంత్రి వాస్తవాలను వివరించడం లేదన్నారు. ఎమ్మెల్యేలకు ఇస్తున్న భద్రతను మాత్రమే చంద్రబాబుకు ఇస్తున్నారని చినరాజప్ప చెప్పారు. 20 ఏళ్లుగా డీఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి అధికారులు చంద్రబాబుకు భద్రతగా ఉంటే ఇప్పుడు వారిని తొలగించారన్నారు. 2 ప్లస్, 2 కానిస్టేబుళ్లను మాత్రమే భద్రతగా ఉంచారని తెలిపారు. ఎస్కార్ట్ వాహనాన్ని తొలగించి... కోర్టు ఆదేశాలతో తిరిగి ఏర్పాటు చేశారని చినరాజప్ప పేర్కొన్నారు.
"చంద్రబాబుకు భద్రతపై... కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు" - chandrababu security
చంద్రబాబు భద్రత విషయంలో ప్రభుత్వం కోర్టును తప్పుదోవ పట్టించిందని మాజీ హోంమంత్రి చినరాజప్ప ఆరోపించారు. ప్రస్తుత హోంమంత్రి సుచరిత వాస్తవాలను దాస్తున్నారని తెలిపారు. చంద్రబాబుకు ఎమ్మెల్యేలకు ఇస్తున్న భద్రతే కేటాయించారని చెప్పారు.
చంద్రబాబు భద్రత విషయంపై కోర్టులను తప్పుదోవ పట్టించారు : చినరాజప్ప
ఇదీ చదవండి :డిసెంబర్ 12నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు