ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంచి చెబుతానంటే అడ్డుకున్నారు.. రెడ్ జోన్ అన్నారు! - ఏపీ లాక్ డౌన్ న్యూస్

గుంటూరు జిల్లా నరసరావుపేట తెదేపా సమన్వయకర్త డా. అరవిందబాబును పోలీసులు అడ్డుకున్నారు. నరసరావుపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో వైరాలజీ ప్రయోగశాల సందర్శనకు వచ్చిన ఆయనను పోలీసులు నిలువరించారు. ఆసుపత్రి రెడ్​జోన్ ఉన్న కారణంగా అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తానొక్కడినే వైద్యశాలకు వెళ్తానన్న అనుమతి ఇవ్వకపోవటంపై అరవిందబాబు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

తెదేపా నేతను అడ్డుకున్న పోలీసులు
తెదేపా నేతను అడ్డుకున్న పోలీసులు

By

Published : Apr 19, 2020, 12:36 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటుచేసిన వైరాలజీ ప్రయోగశాల సందర్శనకు వచ్చిన తెదేపా నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ అరవిందబాబును శనివారం పోలీసులు అడ్డుకున్నారు. ఆసుపత్రిలోకి ఇతరులు ఎవర్నీ అనుమతించమని పోలీసులు ఆయన్ను గేటు బయటే నిలిపివేశారు. తాను స్వయంగా పరీక్ష చేయించుకొని ప్రయోగశాల ఉపయోగాలను ప్రజలకు తెలియచెప్పేందుకు వచ్చానని.., తనతో ఎవరూ రారని.. తానొక్కడినే లోపలికి వెళ్తానని అడగ్గా అందుకు పోలీసులు నిరాకరించారు.

రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్న ఆసుపత్రిలోకి ఎవర్నీ పంపమని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో అరవిందబాబు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును ఖండిస్తూ ఆసుపత్రి సమీపంలోని దుకాణాల ఎదుట ఆయన బైఠాయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు దురుసుగా వ్యవహరించటంతో ఐజీ ప్రభాకరరావుకు ఫోన్‌ద్వారా ఫిర్యాదు చేశారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశంపై పరిశీలించేందుకు వస్తే స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరు బాగాలేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details