ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతులందరికీ సాయం'

అన్నదాతా సుఖీభవ పథకం ద్వారా రైతులందరికీ పెట్టుబడి సాయం ఇస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వని కర్షకులకూ రాష్ట్ర ప్రభుత్వం నగదు అందిస్తోందని వెల్లడించారు.

మాట్లాడుతున్న మంత్రి ప్రత్తిపాటి

By

Published : Feb 19, 2019, 2:39 PM IST

కౌలు రైతులు, 5 ఎకరాల పైబడి ఉన్న రైతులకు రూ.15 వేల పెట్టుబడి సాయం ఇస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఉద్ఘాటించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి... మొదటగా భూమి ఉన్న రైతులకు అన్నదాతా సుఖీభవ పథకం ద్వారా పెట్టుబడి సాయం ఇస్తామన్నారు. కౌలు రైతులందరిని గుర్తించిన తర్వాత మే, జూన్‌లో పెట్టుబడి కోసం నగదు అందిస్తామని స్పష్టం చేశారు. కేంద్రం ఇవ్వని కర్షకులకూ రాష్ట్ర ప్రభుత్వం నగదు అందిస్తోందన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామన్న మంత్రి... పంట దిగుబడిలో అన్ని రాష్ట్రాల కంటే ముందున్నామని తెలిపారు.

మాట్లాడుతున్న మంత్రి ప్రత్తిపాటి

రైతు కోటయ్య మృతిని రాజకీయం చేయడం బాధాకరమని మంత్రి ప్రత్తిపాటి ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్సవాల నిర్వహణలో రైతులకు నష్టం కలగకుండా చూడాలని ముందే అధికారులకు సూచించామని చెప్పారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వంపరంగా ఆదుకుంటామని హామీఇచ్చారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పూర్తి విచారణ చేస్తే వాస్తవాలు తెలుస్తాయన్న ప్రత్తిపాటి... సీఎం సానుకూలంగా స్పందించి రూ.5 లక్షలు సాయం ప్రకటించినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details