మనసు రావడం లేదా?... అదుపు చేయలేకపోతున్నారా? - twitter
వైకాపా అరాచకాలు పెరిగిపోతున్నాయని... తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. ఈ దాడులు ఖండించడానికి సీఎంకు మనసెందుకు రావడం లేదని ప్రశ్నించారు.
lokesh
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని కాళ్ళకూరు గ్రామ సర్పంచ్ అడ్డాల శివరామరాజుపై వైకాపా శ్రేణులు చేసిన దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఖండించారు. ఇలాంటి దాడులకు అడ్డేలేకుండా పోయిందని దుయ్యబట్టారు. ఈ ఘటనలు ఖండించడానికి జగన్‌కు మనసురావడం లేదా లేక తమ శ్రేణులను అదుపు చేయలేని అసమర్ధతతో ఉన్నారా అని నిలదీశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు గుర్తుంచుకోవాలని నారాలోకేశ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు