ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొప్పర్రు దాడి విచారణ వేగవంతం..16 మంది అరెస్ట్​ - kopparu incident latest updates

గుంటూరు జిల్లా కొప్పర్రులో మాజీ జడ్పీటీసీ శారద ఇంటిపై జరిగిన దాడిని తెలుగుదేశం తీవ్రంగా ఖండించింది. గ్రామంలో పర్యటించిన ఆ పార్టీ నేతలు.. బాధ్యులను శిక్షించే వరకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబసభ్యుల్ని చంద్రబాబు ఫోనులో పరామర్శించారు. దాడి ఘటనపై విచారణ వేగవంతం చేసిన పోలీసులు 16 మందిని అదుపులోకి తీసుకున్నారు.

కొప్పర్రు దాడిని తీవ్రంగా ఖండించిన తెదేపా
కొప్పర్రు దాడిని తీవ్రంగా ఖండించిన తెదేపా

By

Published : Sep 21, 2021, 9:31 PM IST

కొప్పర్రు దాడిని తీవ్రంగా ఖండించిన తెదేపా

గుంటూరు జిల్లా కొప్పర్రులో సోమవారం రాత్రి వినాయక ఊరేగింపు సందర్భంగా వైకాపా, తెలుగుదేశం శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఊరేగింపు సమయంలో మాజీ జడ్పీటీసీ బత్తిన శారద ఇంటి వద్దకు చేరుకున్న వైకాపా శ్రేణులు తమ పార్టీ జెండాలను ఊపారు. వెంటనే తెలుగుదేశం కార్యకర్తలూ తమ పార్టీ జెండాలు చూపారు. ఆగ్రహంతో 100 మంది వైకాపా మద్ధతుదారులు శారద ఇంటిపై దాడికి దిగారు.

తెలుగుదేశం శ్రేణులు ప్రతిఘటించగా వైకాపా వర్గాలు జనరేటర్ నుంచి డీజిల్, కిరోసిన్ తీసుకొచ్చి ఇంటి ముందున్న ద్విచక్ర వాహనాలు, ఇంటి ప్రాంగణంలోని సామగ్రిని తగలబెట్టారు. తర్వాత కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఇరువర్గాల ఫిర్యాదులతో పోలీసులు 16 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. నిష్పక్షపాతంగా చట్ట పరిధిలో విచారణ జరిపి దోషులను శిక్షిస్తామని పోలీసులు తెలిపారు.పక్కా ప్రణాళిక ప్రకారమే వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారని మాజీ జడ్పీటీసీ శారద ఆవేదన వ్యక్తం చేశారు. ఘర్షణ సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు.

కొప్పర్రులో పర్యటించిన తెలుగుదేశం నేతలు శారద కుటుంబాన్ని పరామర్శించారు. ఇది ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమేనని ధ్వజమెత్తారు. పోలీసులు అచేతనంగా ఉండటం వల్లే వైకాపా నేతలు ఇల్లు తగలబెట్టి, అనేకమందిని గాయపరిచారని ఆక్షేపించారు. దాడికి కారణమైన వారు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

చంద్రబాబు పరామర్శ..

బాధిత కుటుంబ సభ్యులను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. దాడి వివరాలు తెలుసుకున్నారు. బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఘర్షణల నేపథ్యంలో గ్రామంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. కేసుకు సంబంధించి ఆధారాలను క్లూస్ టీమ్ సేకరిస్తోందని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

సీఎం జగన్​కు బాలాపూర్ లడ్డూ అందజేత

ABOUT THE AUTHOR

...view details