రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు కాపాడేలా చర్యలు తీసుకోవాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు జాతీయ మానవహక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్లను కోరారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో పొత్తూరు వెంకట నారాయణపై జరిగిన దాడిని తెదేపా రెండు కమిషన్ల దృష్టికి తీసుకెళ్లింది. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆనందబాబు కమిషన్లను కోరారు. వైకాపా కార్యకర్తలు దాడిచేసి తీవ్రంగా హింసించడం దారుణమన్నారు. మద్యం సీసాలతో కొట్టి ఒంటికి నిప్పంటించారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడిలో గాయపడిన నారాయణ ఫొటోలు, వీడియోను ఆనందబాబు ఫిర్యాదుకు జతచేశారు.
Pedanandipadu Issue: పెదనందిపాడు ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎస్సీ కమిషన్లకు తెదేపా ఫిర్యాదు
Complaint to NHRC, SC Commission on Pedanandipadu issue: పెదనందిపాడులో తెదేపా మద్దతుదారుడిపై వైకాపా కార్యకర్తలు చేసిన దాడిపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎస్సీ కమిషన్లకు ఫిర్యాదు చేశారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పెదనందిపాడు ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎస్సీ కమిషన్లకు తెదేపా ఫిర్యాదు