ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు ఘటనలో మృతుల కుటుంబాలకు భారీగా అర్థిక సాయం..

Uyyuru Foundation: చంద్రన్న కానుకల పంపిణీ ఘటనలో మృతులకు.. నష్టపరిహారం చెల్లించాలని సీఎం జగన్ ఆదేశించారు. మృతల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. అటు ఘటనకు బాధ్యత వహిస్తూ.. ఉయ్యూరు ఫౌండేషన్ మృతుల కుటుంబాలకు భారీ సాయం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.20 లక్షల సాయం అందించనున్నట్లు ఉయ్యూరు శ్రీనివాస్‌ వెల్లడించారు. అటు చంద్రబాబు కూడా పార్టీ తరుపున మృతుల కుటుంబసభ్యులకు రూ. 5లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

TDP and Vuyyuru Foundation
గుంటూరు ఘటనపై పరిహారం

By

Published : Jan 1, 2023, 11:01 PM IST

Updated : Jan 2, 2023, 10:47 AM IST

Uyyuru Foundation: చంద్రన్న కానుకల పంపిణీ ఘటనలో మృతులకు.. ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వాహకులు భారీ సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల సాయం అందించనున్నట్లు ఉయ్యూరు శ్రీనివాస్‌ వెల్లడించారు. మృతుల కుటుంబసభ్యుల బాగోగులు చూసుకుంటామని, గాయపడినవారికి వైద్య ఖర్చులు పూర్తిగా తామే భరిస్తామని ఆయన పేర్కొన్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పార్టీ తరుపున రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. సీఎం జగన్ ఈ ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతిని వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. టీడీపీ కి చెందిన మరోనేత కోవెలమూడి రవీంద్ర మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి రూ.లక్ష ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు రవీంద్ర వెల్లడించారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మన్నవ మోహనకృష్ణ..గుంటూరులో జనతా వస్త్రాల పంపిణీలో చనిపోయినవారి ఒక్కొక్క కుటుంబానికి ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మన్నవ మోహనకృష్ణ 3 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం ప్రకటించారు. క్షతగాత్రులైనవారికి మన్నవ మోహనకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అని విధాలుగా అండగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 2, 2023, 10:47 AM IST

ABOUT THE AUTHOR

...view details