తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నిర్భందాన్ని నిరసిస్తూ గుంటూరులో తెదేపా శ్రేణలు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గల్లాజయదేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పోలీసుల తీరుపై మండిపడ్డారు. వైకాపా దౌర్జన్యాలను ప్రశ్నించినందుకే రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును పోలీసులు నిర్భందించారని తెలిపారు. గుంటూరు పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందన్నారు. బెదిరింపులు, దాడులతో అధికార పార్టీ స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకుంటోందని ఆరోపించారు. వీటిని కట్టడి చేయడంలో ఎన్నికల సంఘం విఫలమైందని అన్నారు.
"వైకాపా దౌర్జన్యాలను ప్రశ్నించినందుకే చంద్రబాబు నిర్బందం"
వైకాపా ప్రభుత్వ దౌర్జన్యాలను ప్రశ్నించినందుకే చంద్రబాబు నాయుడిని తిరుపతిలో పోలీసులు నిర్భందించారని గుంటూరు ఎంపీ గల్ల జయదేవ్ అన్నారు.
గుంటూరులో ఆందోళన చేస్తున్న తెదేపా నేతలు