మోదుగులకు వ్యతిరేకంగా ర్యాలీ
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి పార్టీకి తూట్లు పొడుస్తున్నారని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు. ఆయన వ్యతిరేకంగా గుంటూరులో ర్యాలీ నిర్వహించారు.
ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న తెదేపా శ్రేణులు
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డికి వ్యతిరేకంగా తెదేపా శ్రేణులు ప్రదర్శనలు చేశారు. గుంటూరు మథర్ ధెరిస్సా విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ... పార్టీకి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. బెదిరింపు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. ఆయన పార్టీలో ఉన్నా, లేకపోయినా వచ్చే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమలో తెదేపాదే విజయమని స్పష్టంచేశారు.
Last Updated : Feb 20, 2019, 9:06 PM IST