గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చందవరం ఇంకా శాంతించలేదు. ఓటింగ్ విషయంలో తలెత్తిన గొడవ, తర్వాత జరిగిన ఘర్షణలపై ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఇవాళ మరోసారి తెదేపా, వైకాపా వర్గీయులు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. వైకాపా శ్రేణుల రాళ్లదాడిలో 9 మంది అధికార పక్ష కార్యకర్తలు గాయపడ్డారు. ఓ పోలింగ్ కేంద్రంలో అదనంగా 50 ఓట్లు పోల్ కావడంపై నిన్నటి నుంచి వివాదం కొనసాగుతుంది.
గుంటూరుజిల్లాలో అక్కడక్కడా కొనసాగుతున్న ఉద్రిక్తతలు - tdp
గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలో నిన్నటి నుంచి ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓ పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా, వైకాపా వర్గీయులు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇరుపార్టీల కార్యకర్తలకు గాయాలయ్యాయి.
గుంటూరులో కొనసాగుతున్నఉద్రిక్తలు