ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీపై హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీం' - సుప్రీం కోర్టుపై అమరావతి

supreme on lands at amaravathi
సుప్రీంకోర్టు

By

Published : Aug 17, 2020, 11:32 AM IST

Updated : Aug 17, 2020, 3:58 PM IST

11:29 August 17

సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు

న్యాయవాది లక్ష్మీనారాయణ

మరో అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్-5 జోన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం సమర్థించింది. హైకోర్టులో విచారణ సరిగ్గానే జరిగిందని సీజేఐ బొబ్డే అభిప్రాయపడ్డారు. హైకోర్టులో కేసు తుది విచారణ ముగించాలని సుప్రీం సూచించింది. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు చేస్తూ ఆర్-5 జోన్‌పై గతంలో ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా.. విచారణ పూర్తయ్యే వరకూ వాటిని హైకోర్టు సస్పెండ్ చేసింది.

 తాము రాజధాని కోసం భూ సమీకరణలో ఇళ్లు ఇస్తే... అక్కడ ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వటాన్ని ప్రశ్నిస్తూ వెలగపూడికి చెందిన రైతులు హైకోర్టుని ఆశ్రయించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేయంతో పాటు 60కి పైగా పేజీలతో తీర్పు వెలువరించింది. అయినప్పటికీ ప్రభుత్వం సుప్రింకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు....రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేయటాన్ని తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది. 

ఇదీ చదవండి:ఏపీ ప్రభుత్వం ఫోన్లు ట్యాపింగ్​ చేస్తోంది...

Last Updated : Aug 17, 2020, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details