లాక్‌డౌన్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయగా... గుంటూరు జిల్లాలో ఇంటిదొంగలు అక్రమ మార్గంలో విక్రయాలు చేపట్టారు. నరసరావుపేట, మండలం పరిధిలోని రావిపాడు, ములకనూరు గ్రామాల్లోని మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. అధికారులకు తెలియకుండా దుకాణం తెరిచి మద్యాన్ని దొంగిలించి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సమాచారం తెలుసుకున్న ఆబ్కారీ అధికారులు పోలీసుల సాయంతో దుకాణాలు తెరిచి నిల్వల్లో తేడాలు గమనించారు. నరసరావుపేటలోని గుంటూరు రోడ్డులో మద్యం దుకాణంలో 5 లక్షల విలువైన మద్యం తగ్గగా...స్టేషన్ రోడ్డులోని దుకాణంలో 6 లక్షల 80 వేల విలువైన మద్యం తగ్గినట్లు గుర్తించారు. ఇద్దరు సూపర్‌వైజర్లు, ఇద్దరు సహాయకులను విధులను నుంచి తొలగించిన అధికారులు...వీరికి సహకరించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సత్యనారాయణను సస్పెండ్ చేశారు.
ప్రభుత్వ మద్యం దుకాణంలో ఇంటి దొంగలు
నరసరావుపేటలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సిబ్బంది చేతివాటం చూపించారు. లాక్‌డౌన్ వేళ దుకాణాలు తెరిచి అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. ఇద్దరు సూపర్‌వైజర్లు, సహాయకులపై అధికారులు వేటు వేశారు. వీరికి సహకరించిన కానిస్టేబుల్ సత్యనారాయణను సస్పెండ్ చేశారు.
ప్రభుత్వ మద్యం దుకాణంలో ఇంటి దొంగలు..