కరోనా వ్యాప్తి నేపథ్యంలో గుంటూరు జిల్లాలో లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని పోలీసులు ప్రచారం నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసు బలగాలు పహారా కాస్తూ... రహదారులపై ఎవరూ తిరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నరసరావుపేటలో గ్రామీణ ఎస్పీ విజయారావు పర్యటించి పోలీసులకు పలు సూచనలు చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నానికి ఎవరైనా అడ్డుపడి వీధుల్లో తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
'లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు' - lockdown in guntur
ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నానికి ఎవరైనా అడ్డుపడి వీధుల్లో తిరిగితే... కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయారావు స్పష్టం చేశారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని సూచిస్తున్నారు.
గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయారావు