నాలుగైదు రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 7 లేదా 9వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్‌ను కలిసిన ఉన్నతాధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్, విజయకుమార్... 50 శాతం లోపు రిజర్వేషన్లు ఉండాలన్న హైకోర్టు తీర్పుపై చర్చించారు. రిజర్వేషన్ల ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తున్నామని... 2 రోజుల్లోనే వివరాలు అందిస్తామని తెలిపారు.
ఆ వివరాలు అందగానే నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల కమిషనర్ చెప్పినట్లు తెలుస్తోంది. సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వచ్చే అవకాశం ఉన్నందున... ఆమేరకు సహకరిస్తామని రమేష్‌కుమార్ చెప్పినట్లు సమాచారం. అలాగే ఎన్నికల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై... ఎన్నికల కమిషనర్‌తో డీజీపీ గౌతమ్ సవాంగ్ 2 గంటల పాటు చర్చించారు. సున్నిత, అతిసున్నిత పోలింగ్ స్టేషన్లు ఉన్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాలోచనలు చేశారు.