ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని మారిస్తే చూస్తూ ఊరుకోబోమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాసరాజు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలోని రాజధాని రైతులతో సమావేశమయ్యారు. రాజధాని మార్పుపై వస్తున్న అపోహల వస్తున్నందున ప్రధానికి ఫిర్యాదు చేస్తామన్నారు. రాజధానిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దని ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మారుస్తారా..? - guntur
రాజధానిపై స్పష్టత ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాసరాజు ఖండించారు.
రాష్ట్ర భాజపా అధికార ప్రతినిధి శ్రీనివాసరాజు మీడియా సమావేశం