రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం కౌంటర్లు.. గుంటూరులో మాత్రం బోసిపోయాయి. గుంటూరు తితిదే కల్యాణ మండపం రెడ్‌జోన్ పరిధిలో ఉందంటూ అధికారులకు..లడ్డు విక్రయాలకు అనుమతి ఇవ్వలేదు. స్వామి వారి ప్రసాదం కోసం ఆశగా వచ్చిన భక్తులకు నిరాశతో వెనుతిరిగారు. రెడ్ జోన్ పరిధిలో ఉన్న కౌంటర్లను గ్రీన్ జోన్లో ఏర్పాటు చేసి లడ్డు విక్రయాలు జరపాలని భక్తులు కోరుతున్నారు.
గుంటూరులో తితిదే లడ్డు విక్రయాలకు అనుమతి నిరాకరణ - గుంటూరులో లాక్డౌన్ వార్తలు
గుంటూరు నగరం రెడ్‌జోన్ పరిధిలో ఉన్నందున .. శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయానికి అధికారులు అనుమతినివ్వలేదు. పట్టణంలోని ప్రసాద కౌంటర్లు కొనేవారు లేక వెలవెలబోయాయి.
గుంటూరులో బోసిపోయిన లడ్డు ప్రసాదం కౌంటర్.