ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశువుల మేతకు ఉపాధి తోడు

వేసవిలో పశుగ్రాసం కొరత వెంటాడుతోంది. పైగా వేడి వల్ల పశువుల శరీరంలో ఒత్తిడి పెరిగి పాల ఉత్పత్తి తగ్గుతోంది. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో జిల్లాల్లో 2 వేల ఎకరాల్లో బహుళ వార్షిక పశుగ్రాసం పెంపకానికి శ్రీకారం చుట్టింది. దీనివల్ల పశువుల ఆరోగ్యంతో పాటు పాల దిగుబడి పెరుగుతుందని భావిస్తున్నారు.

fodder scheme
పశుగ్రాసం పెంపకం

By

Published : May 20, 2021, 4:48 PM IST

గుంటూరు జిల్లాల్లోని అన్ని మండలాల్లో ఎకరాకు 90 టన్నుల గ్రాసం చొప్పున 2వేల ఎకరాల్లో పెంచితే మొత్తం మీద 1,80,000 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో గ్రాసం కొరతను అధిగమించవచ్చని అధికారులు చెబుతున్నారు.

రెండున్నర ఎకరాల వరకు అవకాశం

రైతు భరోసా కేంద్రంలోని పశుసంవర్థక శాఖ సహాయకులు రైతులను గుర్తించి వారి భూములను పరిశీలించి నీటి వసతి ఉన్న వాటిని ఎంపిక చేస్తారు. ఆ జాబితాను పశువైద్యాధికారి ద్వారా ఏపీవోకు పంపించి అందుకు తగిన అనుమతులు తీసుకుంటారు. తరువాత పొలంలో పశుగ్రాసం పెంచేందుకు రైతులకు అనుమతి పత్రం జారీ చేస్తారు. 25 సెంట్లు నుంచి 2.5 ఎకరాల వరకు పెంచవచ్ఛు రైతులు సంఘంగా ఏర్పడితే 5 ఎకరాల వరకు అవకాశం ఇస్తారు. దీనికి గ్రామపంచాయతీ తీర్మానం, జాబ్‌కార్డు, ఆధార్‌ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు పాసు పుస్తకం, రేషన్‌ కార్డు నకలు అందచేయాలి. అనంతరం ఉపాధి క్షేత్ర సహాయకులు మస్టరు రోలు వేస్తారు. సాంకేతిక సహాయకులు చెక్‌ మెజర్‌మెంట్లు చేసి మండల అభివృద్ధి అధికారి ద్వారా రైతులకు చెల్లింపులు చేస్తారు. గ్రాసం మేపితే పశువుల్లో వ్యాధినిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాయని కారుమంచి పశువైద్యాధికారిణి చంద్రకళ పేర్కొన్నారు. ఈ విధానంలో దాణా ఖర్చు తగ్గుతోందన్నారు. రోజు ఇచ్చే దాని కన్నా 1.5 లీటర్ల నుంచి 2 లీటర్ల వరకు అధిక పాల దిగుబడి వస్తుందన్నారు.

ఇదీ చదవండీ.. విశాఖ: మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు

ABOUT THE AUTHOR

...view details