గుంటూరు జిల్లాలో సుమారు 200 కోళ్లఫారాలున్నాయి. వీటి ద్వారా సుమారు 7 వేల మంది ఉపాధి పొందుతున్నారు. మార్చిలో ప్రతి రోజు జిల్లాలో 65 నుంచి 70 లక్షల వరకు కోడిగుడ్లు ఉత్పత్తి అయ్యేవని, ప్రస్తుతం 30 నుంచి 35 లక్షలలోపే ఉత్పత్తి అవుతున్నట్టు ఆయా ఫారాల నిర్వాహకులు చెబుతున్నారు. కరోనా రెండో దశలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు అనేక మంది కోడిగుడ్లను తమ రోజువారీ ఆహారంలో ఒకటిగా చేర్చారు. ఓ వైపు డిమాండ్ పెరగడం, మరో వైపు వేసవిలో గుడ్ల ఉత్పత్తి తగ్గడంతో పౌల్ట్రీ పరిశ్రమపై ఒత్తిడి పెరిగిపోయింది. ఈ సీజన్‌లో గుడ్ల ధర కూడా పెరిగింది. కోళ్ల ఫారాల నిర్వాహకులు ఒక్కో గుడ్డును రూ.4.85 చొప్పున విక్రయిస్తున్నారు. అక్కడి నుంచి అవి చేతులు మారుతుండడంతో ధరలో వ్యత్యాసం కన్పిస్తోంది. వ్యాపారులు పట్టణాల్లోనైతే రూ.5.50కు, గ్రామాల్లో అయితే రూ.6కు విక్రయిస్తున్నారు.
ఒడుదొడుకుల్లో పరిశ్రమ..