ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలో హోదా కాకా - ఏపీ ప్రత్యేక హోదా

ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు డిమాండ్ చేస్తూ చేపడుతున్న బంద్ కొనసాగుతోంది.

స్తంభించి ఏపీ

By

Published : Feb 1, 2019, 10:04 AM IST

ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు డిమాండ్ చేస్తూ చేపడుతున్న బంద్ కొనసాగుతోంది.

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇవ్వాళ చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన సమితి, వామపక్షాలు సంయుక్తంగా పిలుపునిచ్చిన ఈ బంద్​లో పలు రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వామపక్షపార్టీల నేతలు బంద్​లో పాల్గొని నిరసనలు తెలిపారు. వ్యాపారులు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా పాల్గొని నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు, ఆర్టీసీలోని 9 సంఘాలతో కూడిన ఐకాస తో పాటు పలు సంఘాలు బంద్​కు మద్దతు పలికాయి. రాష్ట్రవ్వాప్తంగా కార్మిక పరిషత్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపుతున్నారు. పలు విద్యాసంస్థలు, కార్యాలయాలు ముందస్తు సెలవు ప్రకటించాయి. బంద్ కు వైకాపా, జనసేన, భాజపా దూరంగా ఉన్నాయి.
అసెంబ్లీలో నిరసన

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు రాష్ట్ర అసెంబ్లీలో నిరసన తెలిపారు. బంద్‌కు సంఘీభావంగా సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లబ్యాడ్జీలు, నల్లచొక్కాలు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్​కు నిరసన తెలుపుతూ ఈ నిర్లయం తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details