ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గుంటూరును స్వచ్ఛ నగరంగా మార్చేందుకు అందరూ సహకరించాలి' - గుంటూరు మేయర్ కావటి మనోహరనాయుడు వార్తలు

గుంటూరులో వార్డు సచివాలయ సిబ్బందికి సాలిడ్ వేస్ట్ మేనేజ్​మెంట్​కు సంబంధించిన కిట్లను.. మేయర్ మనోహరనాయుడు పంపిణీ చేశారు. గుంటూరును స్వచ్ఛ నగరంగా మార్చటంలో ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.

solid waste management kits distribution
solid waste management kits distribution

By

Published : May 26, 2021, 6:26 PM IST

గుంటూరును స్వచ్ఛ నగరంగా మార్చటంలో ప్రజలందరూ సహకరించాలని మేయర్ కావటి మనోహరనాయుడు విజ్ఞప్తి చేశారు. వార్డు సచివాలయ సిబ్బందికి సాలిడ్ వేస్ట్ మేనేజ్​మెంట్​కు సంబంధించిన కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఐటీసీ సంస్థ సహకారంతో నగరపాలక సంస్థ పరిధిలో పనిచేసే సచివాలయ సిబ్బందికి ఈ కిట్లను అందజేశారు.

జిల్లాలో స్వచ్ఛ కార్యక్రమాలకు సంబంధించి ఐటీసీ సంస్థ..మూడేళ్లుగా కార్పోరేషన్ తో కలిసి పని చేస్తోంది. ప్రస్తుతం స్వచ్ఛ గుంటూరు కార్యక్రమాన్ని రెండు వార్డుల్లో ప్రయోగాత్మకంగా చేపట్టామని.. అందుకు ఈ సంస్థ సహకరిస్తోందని మేయర్ తెలిపారు. త్వరలోనే నగరంలోని అన్ని ప్రాంతాల్లో మెరుగైన స్వచ్ఛ కార్యక్రమాల్ని నిర్వహిస్తామన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details