ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సెలవుల పెళ్లికొడుకు.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ముసుగులో మోసాలు!

అమెరికాలో ఉంటాడు. సెలవులపై ఇండియా వచ్చినప్పుడల్లా ఒకరిని పెళ్లాడతాడు. కొద్దిరోజులు కాపురం చేసి మొహం చాటేస్తాడు. ఈ నిత్య పెళ్లికొడుకు ఉదంతాన్ని ఓ బాధిత యువతి ఒకరు వెలుగులోకి తెచ్చారు. తనను వివాహమాడి మోసగించిన తీరుపై ఆమె సోమవారం గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Software employee scams
Software employee scams

By

Published : Aug 17, 2021, 1:37 PM IST

గుంటూరు జిల్లా క్రోసూరు మండలానికి చెందిన ఒక యువకుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. మధ్యవర్తి ద్వారా అతని తల్లిదండ్రులు వివాహ సంబంధాలను చూస్తుంటారు. తమ అబ్బాయి అందగాడని, అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అంటూ ఎర వేస్తారు. సెలవుపై అతను స్వగ్రామానికి వచ్చినప్పుడు సంబంధం కుదిర్చి వివాహం చేస్తారు. నెల రోజులు కాపురం చేశాక.. మళ్లీ వచ్చి అమెరికా తీసుకెళ్తానని చెప్పి ఉడాయిస్తాడు.

గుంటూరుకు చెందిన ఎంబీఏ చదివిన యువతితో సంబంధం కుదుర్చుకుని రూ.25 లక్షలను కట్నంగా తీసుకుని.. 2019లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. నెలపాటు ఇక్కడే ఆమెతో కాపురం చేశాడు. కొద్దిరోజులయ్యాక అమెరికా తీసుకెళ్తానంటూ నమ్మించి వెళ్లిపోయాడు. నెలలు గడుస్తున్నా రాలేదు. ఫోన్‌ చేసినా స్పందన లేదు. ఈ విషయమై అత్తమామలను అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చింది. లోతుగా విచారిస్తే అతనిపై ఇదే తరహా వివాహాలు చేసుకుని మోసం చేసినట్లు కేసులున్నాయని తెలిసింది.

ఒకరి తర్వాత ఒకరిని..

నిందితుడు అమెరికాలో గ్రీన్‌కార్డు కలిగిన ఒక యువతిని వివాహమాడాడు. 13 ఏళ్ల కిందట విశాఖకు చెందిన యువతిని వివాహమాడి ఆమెను విడిచిపెట్టాడు. మూడేళ్ల తర్వాత ఆమె బంధువును పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత నరసరావుపేటకు చెందిన మరొకరిని వివాహమాడాడు. అతని నిర్వాకం గురించి తెలిసిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి అతని పాస్‌పోర్టు సీజ్‌ చేశారు.

ఆమెతో రాజీ చేసుకుని పాస్‌పోర్టు తీసుకుని అమెరికా వెళ్లాడు. 2019లో గుంటూరుకు చెందిన ఎంబీఏ చదివిన యువతిని మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడు. నెల తర్వాత తీసుకెళ్తానంటూ అమెరికా వెళ్లిపోయాడు. విజయవాడకు చెందిన మరో యువతిని వివాహం చేసుకోవడానికి నిందితుడు ఏర్పాట్లు చేసుకున్నాడు. 2020 డిసెంబరులో వచ్చినప్పుడు ఆమెతో నిశ్చితార్థ చేసుకున్నట్లు గుర్తించారు.

ఇదీ చదవండి:

చేసిన పాపం ఊరికే పోదు.. ఆ బిడ్డల ఉసురు తగిలింది..!

ABOUT THE AUTHOR

...view details