గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యసేవల తీరుపై స్థానికులు మండిపడ్డారు.గుంటూరు జిల్లా కొండవీడుకు చెందిన సత్యవాణి...పాముకాటుకు గురై ఆస్పత్రికి వచ్చింది.3 గంటలు వేచి చూసినా వైద్యులు రాలేదు... చికిత్సా చేయలేదు.గత్యంతరం లేక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.పాము కాటుకు గురైన ఆమెకు మొదట బంధువులు ఫిరంగిపురంలో ప్రాథమిక చికిత్స అందించారు.పరిస్థితి విషమించిందని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.ఎంతకీ వైద్యులు రాకపోయేసరికి కుటుంబసభ్యులు...వైద్యుల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.చివరకు పోలీసులు సర్ది చెప్పగా...ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
పాముకాటుకు గురై ప్రభుత్వాసుపత్రికి వస్తే... స్పందించని వైద్యులు
పాముకాటుకు గురై ఓ మహిళ గుంటూరు ప్రభుత్వం ఆస్పత్రికి వచ్చింది. ఎంతసేపు చూసినా వైద్యులు రాకపోయేసరికి ఆమె కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు. వైద్యులు లేరని తేల్చడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ggh