గొర్రెల మంద పైకి కారు దూసుకెళ్లిన ఘటనలో కాపరి మృతి చెందాడు. సుమారు 25 గొర్రెలు చనిపోగా.. మరో 15 తీవ్రంగా గాయపడ్డాయి. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో ఈ ప్రమాదం జరిగింది. మంగళగిరి నుంచి తెనాలి వైపు కారు వెళ్తుండగా ఘటన జరిగింది. మంగళగిరి రూరల్ సీఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాపరి మృతదేహాన్ని ఎన్ఆర్ఐ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రోడ్డుపై నుంచి గొర్రెలను పక్కకు పెట్టించారు.
తూర్పు గోదావరి జిల్లా: