ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాకు ఎవరితో పొత్తు లేదు.. ఆ అవసరమూ లేదు! - గుంటూరు

భాజపా, తెరాసతో వైకాపాకు అవగాహన ఉందన్న ప్రత్యర్థుల విమర్శలను జగన్ సోదరి షర్మిల తిప్పికొట్టారు. తమకు ఎవరితోనూ పొత్తు లేదని.. ఆ అవసరమూ లేదని గుంటూరు జిల్లా బాపట్ల వైకాపా రోడ్ షోలో స్పష్టం చేశారు.

షర్మిల రోడ్​షో

By

Published : Apr 1, 2019, 1:02 PM IST

షర్మిల రోడ్​షో
గుంటూరు జిల్లా బాపట్లలో వైకాపా అధినేత జగన్ సోదరి షర్మిల రోడ్​షో చేశారు.స్టువర్టుపురం నుంచి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ఎన్నికల ప్రచారం చేశారు. వైకాపా అధికారంలోకి రాగానే పేదలకు ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. తమరుఏ పార్టీతో పొత్తు లేదని, ఒంటరిగానే పోరాడుతున్నామని చెప్పారు.బాపట్ల శాసనసభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కోన రఘుపతి, ఎంపీ అభ్యర్థిగా నందిగం సురేష్​లను అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details