గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బాల సాహితీ వేత్త,రచయిత షేక్ అబ్దుల్ హకీం జానీ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు.మహారాష్ట్రలో పాఠ్యపుస్తకాల్లో జానీ రచనలకు స్థానం దక్కింది. 2019-20విద్యాసంవత్సరానికి తెలుగును ద్వితీయ భాషగా ఎంచుకునే పదకొండవ తరగతి విద్యార్థుల తెలుగువాచకంలో జానీ రచనలు భాగమయ్యాయి.జానీ రాసిన అమ్మ ఒడి కథల సంపుటిలోని'బాధ్యతాయుత పౌరులు'అనే అంశంపై రాసిన కథనంను మహారాష్ట్రప్రభుత్వం తన పాఠ్యప్రణాళికల్లో పొందుపర్చింది.ఇలాంటి గుర్తింపులు తనలో బాధ్యతను పెంచుతాయని జానీ అంటున్నారు.
"మహారాష్ట్ర పాఠ్య పుస్తకంలో.. తెనాలి వాసికి ప్రత్యేక గుర్తింపు" - మహారాష్ట్ర తెలుగు పాఠ్య పుస్తకంలో ఆయన రచనలకు చోటు
గుంటూరుకు చెందిన బాలసాహితీవేత్త షేక్ ఆబ్దుల్ హకీం జానీ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. జానీ రచనలను మహారాష్ట్రప్రభుత్వం విద్యార్దులకు పాఠ్యంశంగా చేర్చింది.
shaik abdhul hakeem jaani of tenali at guntur district writings have been found in the Telugu textbook of Maharashtra