ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా.. 17 మంది పిల్లలకు విముక్తి కల్పించినట్లు గుంటూరు జిల్లా మేడికొండూరు సీఐ ఆనందరావు తెలిపారు. యడ్లపాటి వెంకట్రావు కాలనీకి చెందిన కొందరు బాలలు.. పొలం పనులకు వెళ్తున్నారని పేర్కొన్నారు. వారిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు. పిల్లల తల్లిందండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించామని స్పష్టం చేశారు.
మేడికొండూరులో 17 మంది బాలలకు విముక్తి - మేడికొండూరులో బాలకార్మికులకు విముక్తి
గుంటూరు జిల్లా మేడికొండూరులో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతంగా సాగింది. పొలం పనులకు వెళ్తున్న 17 మంది బాలలను గుర్తించి.. ఆయా కుటుంబాలకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు.
మేడికొండూరులో ఆపరేషన్ ముస్కాన్