200 రకాల వరి వంగడాలతో.. విత్తన పండగ - దేశీయ విత్తనాలు సాగు
గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తోటలో 200 రకాల వరి వంగడాలతో... 'విత్తన పండుగ' నిర్వహించారు. దేశీయ విత్తనాలతో సేద్యం.. ప్రకృతికి మేలు చేస్తుందని నిర్వాహకులు అవగాహన కల్పించారు.
'మన ఊరు మన విత్తనం పండుగ'
గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో రైతు సాధికార సంస్థ వ్యవసాయ శాఖ ఆధర్యంలో 'మన విత్తనాల పండుగ' నిర్వహించారు. 200 రకాల వరి వంగడాలతో విత్తన పండుగ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, ప్రకృతి వ్యవసాయ సలహాదారు విజయ కుమార్, రైతు సాధికార సంస్థ అధికారులు రైతులు పాల్గొన్నారు. దేశీయ విత్తనాలతో సేద్యంపై అవగాహన కల్పించారు.