ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

68 బస్సులపై కేసు.. మరో 21 సీజ్! - రవాణా శాఖ

గుంటూరు జిల్లాలో రవాణా శాఖ అధికారులు ముమ్మరంగా బస్సుల తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బస్సులపై కేసులు నమోదు చేశారు.

school-buses-checkings

By

Published : Jun 19, 2019, 4:39 PM IST

Updated : Jun 19, 2019, 4:52 PM IST

జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు తనిఖీలు

నిబంధనలకు విరుద్ధంగా నడిచే పాఠశాల బస్సులను సీజ్ చేస్తామని గుంటూరు జిల్లా ఉప రవాణాశాఖ అధికారి రాజారత్నం హెచ్చరించారు. వారం రోజుల నుంచి నిర్వహిస్తున్న తనిఖీల్లో పెద్దమొత్తంలో కేసులు నమోదు చేశారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలోని ప్రైవేటు పాఠశాలల పై బాపట్ల డివిజన్ ఎడ్యుకేషన్ తనిఖీ బృందం తనిఖీలు నిర్వహించారు. మండలంలో ఉన్న అన్ని ప్రైవేటు బడులను పర్యవేక్షించి అక్కడి బస్సులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేవో పరిశీలించారు. పాఠశాలకు సంబంధించి లైసెన్సు.. ఫీజుల వివరాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకూ 68 బస్సులపై కేసులు నమోదు చేశామని.. మరో 21 బస్సులు సీజ్ చేశామని చెప్పారు.

Last Updated : Jun 19, 2019, 4:52 PM IST

ABOUT THE AUTHOR

...view details