రాష్టంలో దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఈనెల 17న దళిత, గిరిజన ఉద్యోగ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు.. అంటరానితనం నిర్మూలన పోరాట సమితి వ్యవస్థాపకుడు చార్వాక తెలిపారు. కార్యక్రమ పోస్టర్ ను గుంటూరులో ఆవిష్కరించారు. దళితులు, గిరిజనులపై అధికార పార్టీ దాడులు పెరిగాయన్నారు.
ప్రశ్నించిన వారిపైన అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకే ఈ నెల 17న గుంటూరులో సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అన్ని దళిత సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.