SC Intimate Meeting In Mangalagiri: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డు నియోజకవర్గాల్లో మాల, మాదిగలను సమన్వయం చేసుకుంటూ సీట్ల కేటాయింపు.. పార్టీలో కీలకపదవులు కల్పిస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీల 27 సంక్షేమ పథకాల్ని రద్దు చేసిన.. జగన్ మాదిగల ద్రోహి అని టీడీపీ మాదిగ సామాజికవర్గ నేతలు ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో హోంమంత్రి, పురపాలకశాఖ మంత్రుల పరిస్థితి వాలంటీర్ల కంటే అధ్వాన్నంగా మారిందని టీడీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు మండిపడ్డారు. రాష్ట్రంలో మాదిగలపై దాడులు, ఆస్తుల విధ్వంసం, అత్యాచారాలు జరుగుతున్నా.. ప్రాణాలు కోల్పొతున్నా వైసీపీలోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు నోరెత్తకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆదాయం.. పక్క రాష్ట్రాలలతో పోల్చి చూసినప్పుడు తగ్గిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ అవినీతిపరుడని, రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని తెలుగుదేశం మాత్రమే కాకుండా బీజేపీ అగ్రనేతలైన అమిత్‌షా, జేపీ నడ్డాలే అంటున్నారని గుర్తు చేశారు. బీజేపీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్పందించాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.
తిన్న తినకపోయిన కడుపుమాడిన క్రమశిక్షణతో ఉండేది మీరని.. మీకు గుర్తు చేస్తున్న అని మాదిగ నేతలను ఉద్దేశ్యించి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యలు వర్ల రామయ్య అన్నారు. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే ప్రధానమైన పదవీలో మిమ్మల్ని పెట్టాలని మీరు చంద్రబాబును అడిగారని.. దానికి చంద్రబాబు అంగీకరించరాని తెలిపారు. అంతేకాకుండా మాదిగ, మాల, రెల్లి కార్పోరేషన్లను కొనసాగించటానికి చంద్రబాబు సుముఖుత చూపారని వివరించారు.