ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంగం డైరీ నుంచి సుగంధ పాలు సరఫరా - సంగం డైరీ న్యూస్

గుంటూరు జిల్లా వడ్లమూడి సంగం డైరీలో కొత్తగా సుగంధ పాలను ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ప్రారంభించారు. సుగంధ ద్రవ్యాల వాడకం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయని అన్నారు.

sangam dairy new product launch
సంగం డైరీ నుంచి సుగంధ పాలు విడుదల

By

Published : Sep 12, 2020, 10:16 AM IST

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి సంగం డైరీలో నూతనంగా సుగంధ పాలను ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ ప్రొడక్ట్ సహజసిద్ధంగా పసుపు, మిరియాలు, అల్లం, దాల్చిన చెక్కలతో సుగంధభరితమైన పాలను మార్కెట్​లో ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఈ సుగంధ ద్రవ్యాల వాడకం వల్ల శరీర ఆరోగ్యానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయని అన్నారు. ప్రతిరోజు ఈ పాలను తీసుకుంటే.. జీర్ణాశయంలో ఆరోగ్యాన్ని పెంపొందించే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details