కృష్ణ వరద వచ్చి లంక గ్రామాల్లో పంటలన్నీ నష్టపోయాయి. దానికి తోడు పశువులకు పశుగ్రాసం కొరత ఏర్పడింది. ఈ సమస్య తగ్గించేందుకు సంఘండెయిరీ యాజమాన్యం ఉచితంగా రైతులకు దాణాప్యాకెట్లు పంపిణీ చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందుబాబు చేతులు మీదుగా 32 గ్రామాల రైతులకు పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం ఆనందబాబు మాట్లాడుతూ..సంఘం డెయిరీ ఇలా రైతులకు చేయూతనిచ్చినందకు సంతోషంగా ఉందని అన్నారు.
లంక గ్రామాల రైతులకు సంఘం డెయిరీ చేయూత - నక్కా ఆనందబాబు
వరద ప్రభావానికి తీవ్రంగా నష్టపోయిన గుంటూరు జిల్లా లంక గ్రామాల రైతులకు సంఘం డెయిరీ చేయూతను ఇచ్చింది. రైతులుకు ఉచితంగా దాణా పంపిణీ చేసింది. ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు చేతులు మీదుగా ప్రారంభించారు.
లంకగ్రామాల రైతులకు సంఘం డైరీ చేయుత