ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో  ఇసుక కష్టాలు రెట్టింపు

రాష్ట్రంలో ఇసుక కష్టాలు ఇబ్బంది పెడుతున్నాయి. నిర్మాణాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సమస్య ఎక్కువగా ఉంది. అవసరం మేర ఇసుక లభించక.. ధరలు రెట్టింపు అయ్యాయి. ఒక్కసారిగా.. ధరలు పెరగేసరికి ఇళ్లు కట్టుకునే వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

By

Published : Aug 14, 2019, 2:28 PM IST

sand-problems

రాష్ట్రంలో రెట్టింపయిన ఇసుక కష్టాలు

రాష్ట్రంలో ఇసుక కొరత నిర్మాణదారులను తీవ్రంగా వేధిస్తోంది.అవసరం మేరకు ఇసుక లభించక..భవన నిర్మాణదారులు,గుత్తేదార్లకు ఇబ్బందులుపడుతున్నారు.నిర్మాణాలు ఎక్కువగా ఉండే విజయవాడ,గుంటూరు,విశాఖ వంటి నగరాల్లో పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి.నూతన ఇసుక విధానం తీసుకొచ్చే వరకు కొరత లేకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినా....పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు రాలేదు.రిచ్‌లు తగ్గిపోవడంతో...ఇసుక కొరత తీవ్రంగా ఏర్పడింది.దీంతో ట్రాక్టర్ల యజమానులు అమాంతం ధరలు పెంచేశారు.మూడు నెలల క్రితం1500ఉన్న ట్రాక్టర్ ఇసుక ధర ప్రస్తుతం6వేలు పలుకుతోంది.అదీ అవసరానికి అందడం లేదు.

ఇసుక కొరతతో నిర్మాణ పనులు నిలిచిపోయి కూలీలు రోడ్డెక్కారు.ఇసుక కొరత కారణంగా నిర్మాణరంగం దాదాపు పడకేసింది.ఈ ప్రభావం వివిధ రంగాలు,వాటిల్లో పనిచేసే కార్మికులపైనా పడుతోంది.ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకు పనులు ఉండటం లేదు.నిత్యం ఇసుక సరఫరా చేసే ట్రాక్టర్లు,లారీలు నిలిచిపోయి..చాలామంది ఉపాధికి గండి పడుతోంది.గోదావరికి భారీగా వరద పోటెత్తుతుండటంతో చాలా రీచ్‌లో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి.

అనంతపురం జిల్లాలో ఇసుక కొరత తీర్చేందుకు వాగులు,వంకల్లో అందుబాటులో ఉండే ఇసుక తరలించుకునేలా ఆ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు.గ్రామాల్లో వీఆర్వో అనుమతి తీసుకుని ఇళ్ల నిర్మాణాలకు ఇసుక తీసుకెళ్లే వెసులుబాటు కల్పించారు.ఇతర జిల్లాల్లో కొన్ని మాత్రమే వెసులుబాటును కల్పిస్తున్నాయి.వాగుల్లో తప్పుకుంటే గ్రామాల్లో కొంతవరకూ ఇసుక కష్టాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

పరుగుల రాణి పీటీ ఉషకు అరుదైన గౌరవం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details