తనను కులం పేరుతో దూషించాడంటూ నరసరావుపేట ఆర్టీసీ డీఎంపై ఒక మహిళా కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నరసరావుపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రభావతి.. గత రెండు నెలల క్రితం డిపోకు చెందిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తనను ఇబ్బందులు గురిచేస్తున్నాడంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
అయితే ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని డిపో మేనేజర్ అబ్దుల్ సలాం తనను కులం పేరుతో దూషించాడని మహిళా కండక్టర్ ప్రభావతి చెప్పారు. దీనిపై మనస్థాపం చెందిన ప్రభావతి.. మాత్రలు మింగి బలవర్మరణానికి పాల్పడింది. మాత్రలు మింగిన పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో డిపో మేనేజర్‌పై ఫిర్యాదు చేసినట్లు మహిళా కండక్టర్ ప్రభావతి మీడియాకు వివరించారు.