ఈ నెల 10, 11వ తేదీల్లో రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ బైఠక్ జరగనున్నాయి. ఈ సమావేశాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పాల్గొనున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన మోహన్ భగవత్‌కు ఆర్ఎస్ఎస్, భాజపా నేతలు ఘన స్వాగతం పలికారు.
రెండ్రోజులపాటు ప్రచారక్ బైఠక్...నూతక్కి చేరుకున్న మోహన్ భగవత్ - ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ తాజా వార్తలు
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గుంటూరు జిల్లా నూతక్కి గ్రామానికి చేరుకున్నారు. నూతక్కి విజ్ఞాన విహార పాఠశాలలో 4 రోజుల పాటు ఆర్ఎస్ఎస్ సమావేశాలు జరగనున్నాయి. రేపు, ఎల్లుండి ప్రచారక్ బైఠక్ నిర్వహించనున్నారు.
మోహన్ భగవత్
అనంతరం మోహన్ భగవత్ రోడ్డు మార్గంలో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి బయలుదేరివెళ్లారు. ఈ నెల 12 వరకు ఆయన నూతక్కిలో ఉండనున్నారు. 4 రోజులపాటు నూతక్కి విజ్ఞాన విహార పాఠశాలలో ఆర్‌ఎస్‌ఎస్ సమావేశాలు జరగనున్నాయి.
ఇదీ చదవండి3నెలల్లో జైలుకెళ్లే వారిపై కేసులు ఎందుకని వదిలేస్తున్నా: రఘురామ