ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

LIVE VIDEO కత్తితో బెదిరించి నగ్నంగా డ్యాన్స్.. రౌడీషీటర్​ పైశాచికత్వం! - పాతబస్తీ చాంద్రాయణగుట్ట

Dancing With Knife In The Old Town: హైదరాబాద్​లోని పాతబస్తీ ప్రాంతంలో ఇంకా కొందరు రౌడీ మూకల ఆగడాలు సాగుతున్నాయి. వారు ఏమి చేసినా పట్టించుకునే వాడే లేదన్న విధంగా ప్రవర్తిస్తున్నారు. ఆ రౌడీషీటర్లు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా హద్దులేకుండా పోతుంది. పోలీసులు ఎన్నిసార్లు వార్నింగ్​లు ఇచ్చిన పట్టించుకోకుండా.. యథావిధిగా వారి పనులను కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా జరిగిన సంఘటన హైదరాబాద్ బ్రాండ్​ విలువ పడిపోయే విధంగా చేస్తుంది.

rowdysheetar
రౌడీషీటర్​

By

Published : Jan 23, 2023, 3:52 PM IST

forcefully Naked Dance By Rowdy Sheetar: ఓ వ్యక్తిని కత్తితో బెదిరించి రౌడీషీటర్​ డ్యాన్స్​ చేయించిన సంఘటన తెలంగాణలోని హైదరాబాద్​లో పాతబస్తీ చాంద్రాయణగుట్ట ప్రాంతంలో జరిగింది. పాతబస్తీకి చెందిన రౌడీషీటర్​ అలీ.. ఈ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. సాలం అనే వ్యక్తిని ఓ ఇంట్లోకి బలవంతంగా తీసుకువచ్చి కత్తితో బెదిరించి.. బట్టలు ఊడదీసి నగ్నంగా డ్యాన్స్​ చేయించాడు. నగ్నంగా ఉన్న వ్యక్తితో పాటు రౌడీషీటర్​ అలీ సైతం కత్తితో డ్యాన్స్​ చేసి.. పైశాచిక ఆనందం పొందాడు. ఆ వ్యక్తిని పట్టుకుని డ్యాన్స్​ చేస్తుంటే.. అక్కడే సోఫాలో ఉన్న వ్యక్తులు తిలకిస్తున్నారు. చేయను అని చెప్పిన సరే.. బలవంతంగా చేయించాడు.

ఆ తరువాత బాధితుడు సాలం చాంద్రాయణగుట్ట పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులపై బలవంతపు నిర్భందం, బెదిరింపులు, దౌర్జన్యం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. అయితే మూడు రోజుల కిందట బార్కస్​ సలాల ప్రాంతంలో రౌడీషీటర్​ అలీ.. పట్టపగలే ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడని పోలీసులు తెలిపారు. ఆ తరువాత అలీ పరారీ ఉన్నాడని పేర్కొన్నారు.

పార్కింగ్​ విషయంలో కత్తితో దాడి: హైదరాబాద్​లో ​చిన్న విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణగా మారింది. ఈ విషయంలో పాతబస్తీకి చెందిన రౌడీషీటర్​ అలీ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. హైదరాబాద్​ జిల్లా పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బార్కస్​ సలార్ ప్రాంతంలో వాహన పార్కింగ్​ విషయంలో గొడవ జరిగింది. స్థానికంగా ఉండే అలీ తమ్ముడికి, సులేమాన్​ అనే రౌడీ షీటర్​కి మధ్య పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవలో అలీ ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. స్థానికులు ఇరు వర్గాలను ఎంత నియంత్రించిన గొడవ ఆగలేదు.

ఆఖరికి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వారిని వారించిన గొడవ సద్దుమణగలేదు. ఇదే సమయంలో సులేమాన్​ను అలీ కత్తితో దాడి చేశాడు. దీంతో సులేమాన్​ చేతికి గాయాలయ్యాయి. అయితే అక్కడి నుంచి అలీ పరారయ్యాడు. వెంటనే పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలీ మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఇలా అలీ కత్తితో ఒక వ్యక్తిని బెదిరించి డ్యాన్స్​ చేయించాడు. దీనిపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

కత్తితో బెదిరించి డ్యాన్స్​

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details