గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కూడలిలోని మూడు దుకాణాలలో చోరీ జరిగింది. ఓ మెడికల్ దుకాణం, దానికి ఆనుకొని ఉన్న మరో రెండు దుకాణాలలో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఉదయం షాపుకు వెళ్లిన మందుల దుకాణం యజమాని దొంగతనం జరిగిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. మెడికల్ షాపుపై కప్పు తొలగించి లోపలికి చొరబడ్డ చోరీగాళ్లు.. రూ. 3వేల నగదు, ఐఫోన్ దొంగిలించగా, మరో దుకాణంలో రూ. 15వేల నగదు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుని కోసం దుకాణంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.
ఈ ఏడాది మే నెలలోనూ ఈ దుకాణంలో ఇదే తరహాల తరహా చోరీ జరిగింది. అప్పుడు పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే మళ్లీ అదే వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడని దుకాణ యజమాని పేర్కొన్నారు.