ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెనాలి దొంగల ముఠా అరెస్టు - తెనాలి దొంగల ముఠా అరెస్టు న్యూస్

గుంటూరు జిల్లా తెనాలిలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి చోరీ చేసిన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

robbery gang arrest
తెనాలి దొంగల ముఠా అరెస్టు

By

Published : Sep 19, 2020, 11:14 PM IST

తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను.. గుంటూరు జిల్లా తెనాలి త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 5.5 లక్షల విలువ చేసే 128 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెనాలి డీఎస్పీ శ్రీలక్ష్మి తెలిపారు. సెల్​ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివరించారు. నిందితుల్లో నలుగురు గుంటూరుకు చెందిన వారు కాగా.. ఒకరు అంగలకుదురుకు చెందిన వారిగా గుర్తించినట్లు వెల్లడించారు. నిందితులపై గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు అయ్యినట్లు వివరించారు. కేసును ఛేదించటంలో ప్రతిభ చూపించిన త్రీటౌన్ పోలీసులను డీఎస్పీ అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details