ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ. 8 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు చోరీ - తెనాలిలో చోరీ

గుంటూరు జిల్లా తెనాలి బాలాజీ రావుపేటలో ఇంటి తాళాలు పగులుగొట్టి దుండగులు చోరీ చేశారు. బీరువా లాకర్ ధ్వంసం చేసి.. 8 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు దోచుకున్నారు.

robbery at tenali
తెనాలిలో చోరీ

By

Published : Sep 7, 2020, 8:28 AM IST

గుంటూరు జిల్లా తెనాలి బాలాజీ రావుపేటలో చోరీ జరిగింది. అర్ధరాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి దుండగులు ఇంటిలోకి ప్రవేశించారు. బీరువా లాకర్ ధ్వంసం చేసి 8 లక్షల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలు, 5 వేల నగదను చోరీ చేశారు.

భాదితుడు గోపాలకృష్ణ తెనాలి త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుటుంబ సభ్యులతో కలిసి శనివారం బంధువుల ఇంటికి గుంటూరు వెళ్లానని.. ఆ సమయంలో దొంగతనం జరిగిందని బాధితుడు తెలిపాడు. తెనాలి త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details