చేసేదేమి లేక గుంతలలో కొమ్మల ఉంచి ప్రయాణికులు అటు వెళ్లొద్దంటూ హెచ్చరిస్తున్నారు. ఒక్క శ్యామలానగర్ వాసులే కాదు... గుంటూరు నగరవ్యాప్తంగా యూజీడీ పనులతో అసంపూర్తిగా మిగిలిన రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తమను ఈ రోడ్లగండం నుంచి గట్టెక్కించాలని వేడుకుంటున్నారు.
గుంటూరులో రెండేళ్ల కిందటే యూజీడీ పనులు ప్రారంభమయ్యాయి. వెయ్యి కిలోమీటర్లకు పైగా పైపులైనులు ఏర్పాటు చేయడం లక్ష్యం కాగా... పనులు ఇంకాకొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు 50 శాతం పనులు పూర్తయ్యాయి. బిల్లుల పెండింగ్, ఇతర కారణాలతో గుత్తేదారు పనులను సగంలోనే నిలిపివేశారు. ఈ పనులను ప్రజారోగ్యశాఖ పర్యవేక్షిస్తుంది. నిబంధనల ప్రకారం రోడ్డు తవ్విన స్థలంలో తిరిగి రహదారి నిర్మాణించాలి. కానీ నిబంధనలు గాలికొదిలి.. రోడ్లను అంసపూర్తిగా వదిలేయడం వలన నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేశ్ బి.లఠ్కర్ చెప్పారు. పనులు తొందరగా ముగించి రోడ్ల పునర్నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.