గుంటూరు జిల్లా మేడికొండూరులో ఆటోను...కారు ఢీ కొట్టింది. ఈప్రమాదంలో నాగయ్య అనే వ్యక్తి మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. మేడికొండూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...వట్టి చెరువు మండలం వింజనంపాడు గ్రామానికి చెందిన చిలక నాగయ్య, అతని కుటుంబ సభ్యులు తొమ్మిది మంది కలిసి వారి బంధువులను పరామర్శించేందుకు ఆటోలో కొర్రపాడు బయల్దేరారు. పేరేచర్ల ఆరో మైలు సమీపంలో రాగానే..వెనక నుంచి వస్తున్న కారు...ఆటోని ఢీ కొట్టింది. దీంతో ఆటో పల్టీ కొట్టింది. ఆటోలో ఉన్న అందరు గాయాలపాలయ్యారు.
accident: ఆటోను ఢీకొట్టిన కారు...ఒకరు మృతి - గుంటూరు జిల్లా నేర వార్తలు
గుంటూరు జిల్లా మేడికొండూరులో దారుణం జరిగింది. ఆటోను... కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదం
క్షత్రగాత్రులను 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగయ్య మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడికొండూరు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: