గుంటూరు జిల్లా వినుకొండ మండలంలో ఘోరం జరిగింది. రెండు ఆటోలు ఢీకొని ఓ వృద్దురాలు మృతి చెందింది. ఏనుగుపాలెేనికి చెందిన ఆలా రామకోటమ్మ(68).. కూలిపనుల నిమిత్తం చీకటిపాలెం వెళ్లింది. పని ముగించుకోని సాయంత్రం తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న ఆటో.. కోటప్ప నగర్ వద్ద ఎదురుగా వస్తున్న మరో ఆటోను ఢీకొట్టింది.
ROAD ACCIDENT: రెండు ఆటోలు ఢీ.. వృద్ధురాలు మృతి
రెండు ఆటోలు ఢీకొని ఓ వృద్ధురాలు మృతిచెందిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వృద్ధురాలు మృతి
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రామకోటమ్మ... రెండు కాళ్లు విరిగి రక్తస్రావంతో ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది. 108 సహయంతో ఆమెను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: