ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - గుంటూరు జిల్లాలో ద్విచక్రవాహనాలు ఢీ

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదంలో మృతి చెందిన కృష్ణారెడ్డి
ప్రమాదంలో మృతి చెందిన కృష్ణారెడ్డి

By

Published : Apr 10, 2021, 6:37 AM IST

వేగంగా... ఎదురెదురుగా వచ్చిన 2 ద్విచక్ర వాహనాలు ఢీ కొని ఒకరు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. కంభంపాడుకు చెందిన సోమల కృష్ణారెడ్డి.. పాలవాయి గేట్ గ్రామంలో పని ముగించుకొని స్వగ్రామానికి బయల్దేరాడు. అదే సమయంలో తుబాడ గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై యాకోబు, బాలమ్మ ద్విచక్ర వాహనంపై వస్తున్నారు.

ఎదురెదురుగా వస్తున్న ఈ రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టగా.. ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. బాధితుల్ని మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా కృష్ణారెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మాచర్ల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details